Telangana

పటాన్‌చెరు జర్నలిస్టుల ఐక్యతకు రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు

– త్వరలో పటాన్‌చెరులో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిద్దాం: కే. విరహత్ అలీ

 -విరాహత్ ఆలిని మర్యాదపూర్వకంగా కలిసిన పటాన్‌చెరు నూతన కార్యవర్గం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

టీయూడబ్ల్యూజే-ఐజేయూ పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కే. విరహత్ అలీని గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన, పటాన్‌చెరు నియోజకవర్గ అధ్యక్షుడు పత్తి నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కే. విరహత్ అలీ మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన జర్నలిస్టుల సమావేశం కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమై రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ప్రశంసించారు. సంఘం పట్ల జర్నలిస్టుల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా కార్యవర్గం పనిచేసిందని కొనియాడారు.

టీయూడబ్ల్యూజే-ఐజేయూ సంఘానికి 75 ఏళ్ల ఘన చరిత్ర ఉందని పేర్కొన్న ఆయన, క్రమశిక్షణకు మారుపేరైన ఈ సంఘంలో ప్రతి జర్నలిస్టు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పదవి అనేది అధికారం కాదని, అది ఒక బాధ్యత మాత్రమేనని అన్నారు. అహంకారానికి దూరంగా ఉండి సేవాభావంతో పనిచేసినప్పుడే పదవికి గౌరవం లభిస్తుందని తెలిపారు.త్వరలో రాష్ట్రస్థాయి సమావేశాన్ని పటాన్‌చెరులో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందుకు స్థానిక కార్యవర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్‌చెరుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ ప్రాంతం ప్రత్యేక అనుభూతి కలిగి ఉందని, ఆ ప్రాముఖ్యతను మరింత పెంచేలా నూతన కార్యవర్గం పనిచేయాలని సూచించారు.

సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు.యూనియన్ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తను నాయకత్వం గుర్తిస్తుందని, వారి సేవలను ఎల్లప్పుడూ గౌరవిస్తుందని విరహత్ అలీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్, రాష్ట్ర కమిటీ నాయకులు అబ్దుల్ బాసిత్, జిల్లా ఉపాధ్యక్షుడు పర్చ శ్రీనాథ్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఉపాధ్యక్షులు శివకుమార్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు శేఖర్, పురుషోత్తం, శ్రీనివాస్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago