Telangana

యువత ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలి యువ కార్మిక సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువ కార్మికులు పోరాడాలి

దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సామ్రాజ్యవాద శక్తులు

విద్యార్థులు,యువ కార్మికులు తమ హక్కుల కోసం… ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ప్రపంచ ప్రజలకు సామ్రాజ్యవాదమే ప్రధాన శత్రువని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికులు, యువత ఐక్యంగా పోరాడాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత దేశ యువతపై ఎంతైనా ఉందని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు.పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జీ.గణేష్ అధ్యక్షతన యువ కార్మికుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ, సామ్రాజ్యవాదానికి ప్రజల సంక్షేమం కంటే లాభాలే ప్రధానమన్నారు. ప్రపంచ దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, ప్రజలపై ఆధిపత్యం సాధించడం, యుద్ధాలను ప్రోత్సహించడం ద్వారా సామ్రాజ్యవాద శక్తులు తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయని విమర్శించారు.సామ్రాజ్యవాద విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

ఆయా దేశాల సహజ వనరులు, సంపదను దోచుకోవడమే లక్ష్యంగా సామ్రాజ్యవాద శక్తులు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాద శక్తులకు అనుకూలంగా, ముఖ్యంగా అమెరికాకు లొంగిపోయే విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం కంటే కార్పొరేట్ మరియు సామ్రాజ్యవాద ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆందోళనకరమన్నారు.ఇటీవల ఢిల్లీలో విద్యార్థులు నిర్వహించిన పోరాటాన్ని ఆయన అభినందించారు.

విద్యార్థులు, యువ కార్మికులు తమ హక్కుల కోసం ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని, ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.యువ కార్మికులు కేవలం పరిశ్రమల్లో తమ హక్కుల కోసం మాత్రమే కాకుండా, దేశ ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, శాంతి కోసం కూడా పోరాటాల్లో ముందుండాలని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికవర్గ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా యువ కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ సదస్సులో వివిధ పరిశ్రమలకు చెందిన కార్మికులు, యువ కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago