చిట్కుల్ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్న నీలం మధు..
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్న నీలం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విశ్వ వసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .తెలుగు సంవత్సరాది సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.అనంతరం చిట్కుల్ గ్రామంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఉగాది పండుగను మనం ఆనందంగా జరుపుకోవడంతో పాటు కొత్త సంవత్సరానికి సంబంధించిన భవిష్యవాణులను తెలుసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయమన్నారు. భారతీయ సంస్కృతిలో జ్యోతిషశాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉగాది రోజున కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం మాత్రమే కాకుండా భవిష్యత్తును అంచనా వేసే విధంగా పండితులు పంచాంగాన్ని చదివి వినిపిస్తారన్నారు. విశ్వవసు నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తుందని పంచాంగ శ్రవణం లో పండితులు వివరించారని తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోతూ ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…