గీతం కార్యశాలలో రాఫ్ట్ సంస్థ నిపుణులు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యను ప్రయోగత్మకంగా, స్వీయ అనుభవాన్ని పెంపొందించేలా నేర్చుకుంటే అది విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదలకు దోహదపడుతుందని, వారిని ఆయా రంగాలలో నిపుణులుగా తీర్చిదిద్దుతుందని రాఫ్ట్ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని అప్లయిడ్ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘చికిత్సలో ఔషధాలను వాడేటప్పుడు అంతర్ద`ష్టులు-భావోద్వేగాలు’ అనే అంశంపై సోమవారం రెండు రోజుల కార్యాచరణ ఆధారిత వర్క్ షాపును ప్రారంభించారు.రాఫ్ట్ ప్రతినిధులు మానసిక శాస్త్ర విద్యార్థులను పది మందిని ఒక జట్టుగా విభజించి, మానవ చిక్కులు, డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ తో గైడెడ్ ఇమేజరీ, భావ ప్రకటనా నైపుణ్యాలు, పాత్ర పోషణ, కౌన్సెలింగ్ లో సూక్ష్మ నైపుణ్యాలు, స్వీయ-ప్రతిబింబ చక్రం, ఆశ్చర్యకర అంశాలు వంటి కార్యకలాపాలలో వారిని నిమగ్నం చేశారు. ఇందులో పాల్గొనే వారికి ఆచరణాత్మక కౌన్సెలింగ్ నైపుణ్యాలను పెంపొందించడానికి, భావోద్వేగ ప్రతిబింబాన్ని మెరుగుపరచ డానికి, వ్యక్తుల మధ్య సంభాషణ కొనసాగించేలా దీనిని రూపొందించారు. మంగళవారం సాయంత్రం వరకు నిర్వహించనున్న ఈ కార్యశాలలో ప్రియమైన వ్యక్తికి, పెంపుడు జంతువుకు లేదా వారు కోల్పోయిన వ్యక్తికి లేఖ రాయడం ద్వారా, వారి భావోద్వేగ విడుదల ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా వివరించడంతో పాటు ఆచరణాత్మకంగా వివరిస్తారు. ఈ కార్యశాల వారిపై చూపిన ప్రభావాన్ని కూడా అంచనా వేస్తారు. మానసిక శాస్త్ర విద్యార్థులు ఈ కార్యశాలలో ఆసాంతం ఉత్సాహంగా, చురుకుగా పాల్గొని, చికిత్సా పద్ధతులపై విలువైన అంతర్ద`ష్టులను పొందుతున్నారు. ఈ వర్క్ షాపును మానసిక శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ దుర్గేష్ నందినీ, డాక్టర్ శ్రీ స్నిగ్ద దిట్టకవి సమన్వయం చేస్తున్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…