Telangana

గీతంలో విజయవంతంగా ముగిసిన ‘గస్టో’

విజేతలకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాల ప్రదానం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్పోర్ట్స్ డైరెక్టరేట్ నిర్వహించిన అంతర్ విశ్వవిద్యాలయ వార్షిక క్రీడా ఉత్సవం, గస్టో 2025, క్రీడాతత్వం, సమష్టికృషి, అజేయమైన క్రీడా స్పూర్తితో విజయవంతంగా ముగిసింది. ఇది కేవలం ఒక క్రీడా పోటీలుగానే కాక, ఓర్పు, ఐక్యత, అవిశ్రాంతంగా రాణించాలనే తపనల పండుగగా సాగింది. ఉత్కంఠభరితమైన ప్రారంభ మ్యాచ్ నుంచి ఉత్సాహభరితమైన చివరి క్షణాల వరకు, టోర్నమెంట్ అద్భుతమైన విన్యాసాలు, ఉత్కంఠభరితంగా ఆటలను ప్రదర్శించడమే గాక, ఇందులో పాల్గొన్న వారందరిపై చెరగని ముద్ర వేసింది.గస్టో అంటే కేవలం గెలవడం, లేదా ఓడిపోవడం కాదని, ఇది పట్టుదల, స్నేహం, క్రీడల ద్వారా జీవితంలోని గొప్ప పాఠాలను నేర్చుకోవడంగా నిర్వాహకులు అభివర్ణించారు. జీవితంలోని ప్రతి రంగంలోనూ బృంద కృషి, అంకితభావం, క్రీడా స్ఫూర్తి యొక్క విలువలను ముందుకు తీసుకెళ్లాలని వారు అభిలషించారు. ఇది విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త డాక్టర్ పి.త్రినాథరావు, క్రీడల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.నారాయణరావు చౌదరి, మేనేజర్ తపస్వి తదితరులు విజేతలకు క్రీడా ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

బ్యాండ్మింటన్ (డబుల్స్) విజేత కేఎల్ యూ-హైదరాబాద్, రెండో స్థానం గీతం

బాస్కెట్ బాల్ (పురుషులు) విజేత మహీంద్రా విశ్వవిద్యాలయం, రెండో స్థానం గీతం

కబడ్డీ (మహిళలు) విజేత గీతం, రెండో స్థానం ఎంఆర్ సీఈటీ

కబడ్డీ (పురుషులు) విజేత ఎంఎల్ఆర్ఎటీ, రెండో స్థానం గీతం

టేబుల్ టెన్నిస్ (పురుషులు-సింగిల్స్) విజేత ఎం-సీఈటీ, రెండో స్థానం శ్రీనిధి

టేబుల్ టెన్నిస్ (పురుషులు-డబుల్స్) విజేత ఎం-సీఈటీ, రెండో స్థానం గీతం

టేబుల్ టెన్నిస్ (మహిళలు-సింగిల్స్) విజేత అవినాష్ కళాశాల, రెండో స్థానం కేఎస్ఆర్ యూహెచ్ఎస్

త్రోబాల్ విజేత గీతం, రెండో స్థానం మహీంద్రా విశ్వవిద్యాలయం

వాలీబాల్ విజేత ఎంఆర్ సీఈటీ, రెండో స్థానం గీతం

క్రికెట్ విజేత ఎస్ఆర్ సీఈటీ, రెండో స్థానం వీజేఐటీ

ఫుట్ బాల్ (పురుషులు) విజేత మహీంద్రా విశ్వవిద్యాలయం, రెండో స్థానం గీతం

ఈ కార్యక్రమాన్ని విద్యార్థిని ఓంకారిణి పాండే సమన్వయం చేశారు. గజ్జె – 2025ని మరపురాని అనుభవంగా మార్చడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. గస్టో 2026ను మరింత ఉన్నతంగా, సాటిలేని ఉత్సవంగా, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించే సిసలైన వేదికగా నిలపాలని ఆమె అభిలషిస్తూ, ఈ వేడుకలను ముగించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago