_ఉప్పొంగిన అభిమానం..
_జనసంద్రంగా పటాన్చెరు..
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
అనునిత్యం అండగా నిలుస్తూ.. తమ కష్ట నష్టాల్లో పాలుపంచుకుంటున్న పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.గురువారం గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి.గురువారం తెల్లవారుజామునే గూడెం మధు నివాసం చేరుకున్న అభిమానులు చాలు వాళ్ళు కప్పి పుష్ప గుచాలో అందిస్తూ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ లో గల మహదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు.
అనంతరం మార్కెట్ రోడ్ లో గల దర్గా, శాంతినగర్ అయ్యప్ప స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం జిఎంఆర్ ఫంక్షన్ హాల్ కు భారీ ర్యాలీగా చేరుకొని, జన్మదిన వేడుకలు నిర్వహించారు. శాంతినగర్లో పార్టీ నాయకులు షకీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ప్రముఖ గాయకుడు గద్దర్ నరసింహ గూడెం మధు జన్మదినం పురస్కరించుకొని పాడిన ప్రత్యేక గీతాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…