Telangana

పరిష్కారానికి నోచుకోలేని ప్రభుత్వ పాఠశాలలు – బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదినగూడ ప్రభుత్వ పాఠశాలలో వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ స్థానిక నాయకులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఎన్ని సార్లు పాఠశాలను సందర్శించినా పరిష్కరం కాకపోడం సిగ్గు చేటనీ అన్నారు. వరద ప్రభావితం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో గురువారం రోజు మొదలైన స్కూళ్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు భిన్నంగా మదినగూడ లో డ్రైనేజీ నీళ్ల మధ్యల విద్యార్థులు గడపాల్సిన దుస్థితి వచ్చిందనీ ఆగ్రహం వ్యక్తo చేశారు. ఈ సమస్యే కాదు బస్తీల్లో కూడా చిన్న వర్షాలు కురిస్తే మొత్తం నీటిమయం అయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ అన్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు మేలుకొని ఇలాంటి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ప్రజలే మీకు బుద్ది చెపుతారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, బిజెపి నాయకులు సురేష్ కురుమ, కేవీ, కుమార్, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 day ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 day ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

2 days ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago