Telangana

నిర్దేశించిన గడువులోగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయండి

రెండు పడకల గదుల ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కల్పన

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉండకుంటే రద్దు చేయండి

ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గ్రౌండింగ్ అయిన యూనిట్లను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పొంది  వాటిని వినియోగించని వారి స్థానంలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు.గురువారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పైన వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలో తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళను లబ్ధిదారులందరూ నిర్మించుకునేలా నిరంతరం సమీక్ష నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడితే  వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 45 రోజుల గడువులోగా నిర్మాణం పూర్తిచేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాస ఉండకుండా ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు నోటరీ పేరుతో లబ్ధిదారులు తమ ఇళ్ళను విక్రయించినట్లు విచారణలో తేలితే వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. స్థానిక కోట కింద మిగిలిన ఇళ్లను సైతం అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.అదే విధంగా నియోజకవర్గ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న 5500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రత్యేకతను పూర్తి చేయాలని. గృహ నిర్మాణ శాఖ ఎమ్ డి గౌతమ్ కు ఎమ్మెల్యే జిఎంఆర్ ఫోన్లో విజ్ఞప్తి చేశారు. వీటి నిర్మాణం పూర్తయితే నియోజకవర్గ పరిధిలోని అర్హులైన నిరుపేదలకు ఇళ్లను కేటాయించడం సాధ్యమవుతుందని తెలిపారు.

కొల్లూరు, ఉస్మాన్ నగర్, అమీన్పూర్ , కర్దనూర్, నాగులపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. వ్యాపార సముదాయాలోని దుకాణాలను నోటిఫికేషన్ ద్వారా మాత్రమే కేటాయించాలని సూచించారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హులకు మాత్రమే వీటిని అందించాలన్నారు.ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు నరసయ్య, పీడి చలపతిరావు, డిఈ రవీందర్, ఆయా మండలాల తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago