మనవార్తలు ,పటాన్చెరు
అంబేద్కర్ ఆలోచనల ప్రాతిపదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన సాగిస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం పటాన్చెరు పట్టణంలో ని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విశాలమైన భారతావనిలో ప్రతి ఒక్కరూ సమానత్వంతో ఉండాలన్న సమున్నత లక్ష్యం తో రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు.
బాబాసాహెబ్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. నేటి తరానికి అంబేద్కర్ ఆలోచనా విధానం ఆదర్శనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, వెంకటేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…