Hyderabad

గ్రామ పంచాయతీలకు జీఎంఆర్ ఫౌండేషన్ చేయూత

పటాన్ చెరు

మాట ఇస్తే మడమతిప్పని నేతగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జిన్నారం మండల పరిధిలోని ఏడు గ్రామపంచాయతీలకు 11 లక్షల రూపాయల విలువైన ట్రాక్టర్ ట్యాంకర్లను అందజేశారు. శనివారం పటాన్చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులకు వీటిని అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సమాజసేవలో జీఎంఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందు ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలోని 55 గ్రామ పంచాయతీలకు గానూ 45 గ్రామ పంచాయతీలకు జిఎంఆర్ పౌండేషన్ తరఫున ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 

గ్రామ అవసరాలకు అనుగుణంగా వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానంగా హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపిటిసి వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు రాజేష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago