పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కోసం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అందించిన వ్యక్తిగత ఆరోగ్య భీమా జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచింది.రామచంద్ర పురానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కుమారుడు సుమంత్ రాజ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ అందించిన ఆరోగ్య భీమా ద్వారా సుమారు 12 లక్షల 50 వేల రూపాయల ఆరోగ్య భద్రత సహాయం అందింది. గత సంవత్సరం క్రితం సైతం ఇదే జర్నలిస్టు కుటుంబ సభ్యులకు సుమారు 6 లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమా పొందారు.ఈ సందర్భంగా జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే అందించిన ఆరోగ్య భీమా ద్వారా తన కుమారుడు పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడని జర్నలిస్ట్ ఆనందం వ్యక్తం చేశారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…