Hyderabad

గీతం స్కాలర్ ప్రభాకర్ రెడ్డికి డాక్టరేట్ ‘….

పటాన్ చెరు:

పారగమ్య స్టెనోస్ట్ ధమనుల ద్వారా న్యూటోనియన్ కాని ద్రవ ప్రవహాల గణిత నమూనా , విశ్లేషణ ‘ దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీన్డ్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వై.ప్రభాకర్ రెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ లోని గణిత శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మారుతీ ప్రసాద్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . స్టెనోజ్ ధమనుల ద్వారా ద్రవ ప్రవాహాన్ని విశ్లేషించడానికి డబుల్ – లేయర్డ్ గణిత నమూనా అభివృద్ధి చేసినట్టు ఆయన తెలియజేశారు . బయోఫ్యూయిడ్ డైనమిక్స్ లో పరిశోధన కోసం , ముఖ్యంగా నోటిక్ ప్రాంత ప్రవాహాలలో ఒక అవకాశం ఉందన్నారు .

ఈ ప్రవాహాల విశ్లేషణ డయాలసిస్ మెషిన్ , కృత్రిమ మూత్రపిండాలు , అవయవాలు మొదలైన జీవ పరికరాలను అభివృద్ధి చేయడానికి , గణిత నమూనాలను రూపొందించడానికి సహాయపడుతుందని తెలిపారు . ఈ నమూనాలు త్రీడీ ప్రింటింగ్ మెషీన్లలో ఉపయోగపడతాయన్నారు . వివిధ శారీరక పరిస్థితులలో స్టెనోటిక్ సమస్యలను పరిశీలించవచ్చన్నారు . మానవ శరీరంలో రక్త ప్రసరణను బాగా అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనాన్ని వినియోగిస్తారని , ధమనుల వ్యాధుల నిర్ధారణ , నివారణలో వైద్యులకు ఇది సహాయపడుతుందని ఆయన వివరించారు . ప్రభాకర్ రెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ.రామారావు , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

14 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago