Telangana

డేటా ఇంజనీరింగ్ పై గీతమ్ లో అంతర్జాతీయ సదస్సు

_పత్ర సమర్పణకు తుది గడువు: సెప్టెంబర్ 10. పేర్ల నమోదుకు: అక్టోబర్ 15

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతోంది. డేటా ఇంజనీరింగ్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్’ అనే అంశంపై నవంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు దీనిని నిర్వహించ నున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.డేటా సెన్స్, డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సుస్థిరత విజ్ఞాన ఆధారిత నిపుణుల వ్యవస్థలసి ఆలోచనలు, కొత్త పరిశోధనల్లోని అంతర్గత అంశాలను పంచుకోవడానికి విశ్వవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, విద్యావేత్తలకు ఒక అంతర్జాతీయ వేదికను అందించడం ఈ సదస్సు లక్ష్యంగా పేర్కొన్నారు, ప్రపంచం నలుమూలలు నుంచి ప్రముఖ వక్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారని, నార్త్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అసెతం; లాస్ వేగాస్ లోని నెవడా వర్సిటీ ఆచార్యులు ప్రొఫెసర్ హెన్రీ సెల్వరాజ్, ప్రొఫెసర్ లక్ష్మీ గేవాలిలు: చెనై, చెంగులోని ఎలక్ట్రానిక్స్ సెర్చ్ అండ్ టెక్నాలజీ వర్సిటీ ప్రొఫెసర్ ఆసిఫ్ ఖాన్, మలేసియాలోని వాటింగ్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ టి. నందకుమార్తో పాటు న్యూయార్క్ లోని ఐబీఎం మేనేజర్ గణేశన్ నారాయణస్వామి తదితరులు తమ అనుభవాలను పంచుకుంటారని ఆ ప్రకటనలో వివరించారు. సిద్ధాంతిక, ఆచరణాత్మక, ప్రయోగాత్మక డొమెన్లతో సహా అన్ని ఇతర రంగాల నుంచి పరిశోధన పత్రాలను ఈ సదస్సులో సమర్పించవచ్చని, ఎంపిక చేసిన పత్రాలను సింగర్ ప్రొసీడింగ్స్ పుస్తకంగా ప్రచురిస్తామని తెలిపారు. పరిశోధనా పత్రాలను సెప్టెంబర్ 10వ తేదీలోగా సమర్పించాలని, వాటిని ఆమోదించినదీ, లేనిదీ సెప్టెంబర్ -30లోగా తెలియజేస్తామన్నారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 15వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్పష్టీకరించారు. పరిశోధనాంశాలు, పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం +91 96201 60306ని సంప్రదించాలని లేదా lcdemi2023@gram.in కు ఈ-మెయిల్ చేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago