_పత్ర సమర్పణకు తుది గడువు: సెప్టెంబర్ 10. పేర్ల నమోదుకు: అక్టోబర్ 15
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతోంది. డేటా ఇంజనీరింగ్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్’ అనే అంశంపై నవంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు దీనిని నిర్వహించ నున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.డేటా సెన్స్, డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సుస్థిరత విజ్ఞాన ఆధారిత నిపుణుల వ్యవస్థలసి ఆలోచనలు, కొత్త పరిశోధనల్లోని అంతర్గత అంశాలను పంచుకోవడానికి విశ్వవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, విద్యావేత్తలకు ఒక అంతర్జాతీయ వేదికను అందించడం ఈ సదస్సు లక్ష్యంగా పేర్కొన్నారు, ప్రపంచం నలుమూలలు నుంచి ప్రముఖ వక్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారని, నార్త్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అసెతం; లాస్ వేగాస్ లోని నెవడా వర్సిటీ ఆచార్యులు ప్రొఫెసర్ హెన్రీ సెల్వరాజ్, ప్రొఫెసర్ లక్ష్మీ గేవాలిలు: చెనై, చెంగులోని ఎలక్ట్రానిక్స్ సెర్చ్ అండ్ టెక్నాలజీ వర్సిటీ ప్రొఫెసర్ ఆసిఫ్ ఖాన్, మలేసియాలోని వాటింగ్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ టి. నందకుమార్తో పాటు న్యూయార్క్ లోని ఐబీఎం మేనేజర్ గణేశన్ నారాయణస్వామి తదితరులు తమ అనుభవాలను పంచుకుంటారని ఆ ప్రకటనలో వివరించారు. సిద్ధాంతిక, ఆచరణాత్మక, ప్రయోగాత్మక డొమెన్లతో సహా అన్ని ఇతర రంగాల నుంచి పరిశోధన పత్రాలను ఈ సదస్సులో సమర్పించవచ్చని, ఎంపిక చేసిన పత్రాలను సింగర్ ప్రొసీడింగ్స్ పుస్తకంగా ప్రచురిస్తామని తెలిపారు. పరిశోధనా పత్రాలను సెప్టెంబర్ 10వ తేదీలోగా సమర్పించాలని, వాటిని ఆమోదించినదీ, లేనిదీ సెప్టెంబర్ -30లోగా తెలియజేస్తామన్నారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 15వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్పష్టీకరించారు. పరిశోధనాంశాలు, పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం +91 96201 60306ని సంప్రదించాలని లేదా lcdemi2023@gram.in కు ఈ-మెయిల్ చేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…