Telangana

కెలాష్ సత్యార్థికి గీతం ఫౌండేషన్ అవార్డు…

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

గీతం 42 వ ఫౌండేషన్ అవార్డు – 2022 ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కెలాష్ సత్యార్థికి ఇవ్వనున్నారు . ఈనెల 13 న ( శనివారం ) నిర్వహించనున్న గీతం 42 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో కెలాష్ సత్యార్థికి ఈ అవార్డు ఫలకంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పది లక్షల రూపాయల చెక్కును కూడా అందజేయనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు .

గీతం ఫౌండేషన్ అవార్డును వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మూడు కోట్ల రూపాయల మూలధన నిధితో స్థాపించినట్టు ఆయన తెలియజేశారు . గీతం ప్రధాన కేంద్రమైన విశాఖపట్నంలో ప్రతియేటా నిర్వహించే గీతం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్య , ఆర్థికశాస్త్రం , సెన్స్ , సాహిత్యం , లలిత కళలు , ప్రజాసేవ వంటి రంగాలలో ఆయా వ్యక్తులు అందించిన ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్టు వీసీ వివరించారు .

అవార్డు గ్రహీత గురించి :

లాష్ సత్యార్థి ( జననం 11 జనవరి 1954 ) మనదేశంలోని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు విద్యపై సార్వత్రిక హక్కును సమర్థించారు . బాలల ఫౌండేషన్ ( ఎస్సీఎస్ ) ను ఆయన 2004 లో స్థాపించారు . ‘ బచన్ బచావో ‘ ఆందోళనలో కెల్లాస్ , ఆయన బృందం కలిసి మనదేశంలోని 86 వేల మందికి పెగా పిల్లలను బాల కార్మికులు , బానిసత్వం , అక్రమ రవాణాల నుంచి విముక్తి చేశారు . బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 1998 లో సత్యార్థి గ్లోబల్ మార్ను రూపొందించి , 103 దేశాలలో , 80 వేల కిలోమీటర్ల సుదీర్ఘ కవాతును నిర్వహించారు . అత్యంత దారుణమైన బాల కార్మికులకు వ్యతిరేకంగా యావత్తు ప్రపంచాన్ని ఒక తాటిపైకి తెచ్చారు . దోపిడీకి గురైన పిల్లల పక్షాన జరిగిన అతి పెద్ద సామాజిక ఉద్యమాలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది . ఆయన సేవలకు గుర్తింపుగా , 2014 లో మలాలా యూసఫ్యితో కలిసి నోబెల్ శాంతి బహుమతి సహ – గ్రహీతగా ఎంపికయ్యారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళవుతున్న సందర్భంగా , ప్రభుత్వం పిలుపుమేరకు గీతమ్ ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ సంబరాలను నిర్వహించారు . జాతీయ జెండా , ప్లకార్డులను చేబూనిన విద్యార్థులు ర్యాలీ చేసి అందరినీ చెత్తన్యపరిచారు . ఈ ర్యాలీని రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ జెండా ఊపి ప్రారంభించగా , స్టూడెంట్ లెఫ్ట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ పర్యవేక్షించారు . సీఎస్ఈ , సివిల్ విభాగాధిపతులు ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , ప్రొఫెసర్ బి.శివరామకృష్ణ , ప్రసాద్ , పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు .

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

6 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

8 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago