మన వార్తలు ,పటాన్ చెరు:
SiCp- అల్యూమినియం గ్రేడెడ్ మెటీరియల్స్ తయారీ , మెకానికల్ , ట్రైబోలాజికల్ ఆనవాలు లక్షణ చిత్రణ ‘ , పై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ములుగుండం శివసూర్యను డాక్టరేట్ వరించింది . అనంతపూర్ లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ( జేఎన్టీయూ ) ప్రొఫెసర్ జి.ప్రశాంతి ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . అభివృద్ధి చెందిన AI7075 / SiC క్రియాత్మకంగా గ్రేడెడ్ మెటీరియల్లు ఇప్పటికే ఉన్న మిశ్రమాలు , ఇతర అనుబంధాలతో పోలిస్తే , ఒకే భాగం లోపల వివిధ యాంత్రిక లక్షణాలను ప్రదర్శించినట్టు ఆయన తెలిపారు . బ్రేక్ రోటర్ డిస్క్ , గేర్లు , అంతర్గత దహన ఇంజిన్ సిలిండర్లు మొదలైన వివిధ ఇంజనీరింగ్ అప్లికేషన్ల కోసం ఈ మెటీరియల్ను వినియోగించవచ్చని ఈ సిద్ధాంత వ్యాసంలో ప్రతిపాదించామన్నారు .
శివసూర్య సమర్పించిన సిద్ధాంత వ్యాసం అనంతపూర్ లోని జేఎన్టీయూ నుంచి పీహెచ్ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , డెరైక్టర్ – ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…