మనవార్తలు ,పటాన్ చెరు:
క్లౌడ్ సురక్షిత డేటా భాగస్వామ్యం కోసం చొరబాటు గుర్తింపు వ్యవస్థ , సంకేత విధానం అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పొన్నూరు సౌజన్యను డాక్టరేట్ వరించింది . హైదరాబాద్ లోని బీవీఆర్ఎస్ఐటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎన్ సునీత ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ భీమార్జునరెడ్డి బాహ్య పరిశీలకుడిగా వ్యవహరించినట్టు తెలిపారు . సౌజన్య సమర్పించిన సిద్ధాంత వ్యాసం హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .