పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కావిటేటింగ్ ఫ్లో పాస్ట్ యాక్సిసిమెట్రిక్ బాడీస్ యొక్క ప్రయోగాత్మక, సంఖ్యాసరమైన పరిశోధన’ చేసి, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీశ్వర్ కందులను డాక్టరేట్ వరించింది. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఈ పట్టాను అందుకున్నారు.ఓయూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సి.ఉషశ్రీ, సీబీఐటీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రవీందర్రెడ్డిల మా ర్గదర్శనంలో ఈ పరిశోధనను చేపట్టినట్టు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.జగదీశ్వర్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, అసోసియేట్ డైరక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…