మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ )
మునుగోడు నియోజకవర్గం లో దళిత వర్గాలను అభివృద్ధి చేసే పార్టీ ఉంది అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో భరత్ చంద్ర ఫంక్షన్ హాల్ లో తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ మాల మాదిగ జేఏసీ కన్వీనర్ దేవుని సతీష్ మాదిగ బిజెపి మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా కరపత్రాలను విడుదల చేసిన గడీల శ్రీకాంత్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఎన్నికల సమయంలో హామీలిచ్చిన కేసీఆర్.గెలిచాక ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
మునుగోడు నియోజకవర్గం లో దళిత వర్గాలను అభివృద్ధి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని దళితుల బ్రతుకులు మారాలంటే రాబోవు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కమలం పువ్వు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని నియోజకవర్గంలోని దళిత వర్గాలను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మాజీ శాసనసభ్యులు చండూరు మున్సిపల్ ఇంచార్జ్ మారుతినేని ధర్మారావు గారు, సహ ఇంచార్జి నాగురాం నామోజీ గారు, తెలంగాణ మాదిగ దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్ల సైదులు మాదిగ గారు, తదితరులు పాల్గొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…