Telangana

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :

నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2023 క్యాలెండర్ ను గురువారం రోజు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి. ఆష్కరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు నిజాలను నిర్భయంగా వార్తలు రాయాలని, అందులో నవతెలంగాణ ది ప్రత్యేకమైన పాత్ర ఉందన్నారు. ఏ పార్టీకి కోమ్ము కాయకుండా, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అధికారుల, పాలకులకు వారధిగా పని చేసి ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తుందని, అందుకు పాతికేయులు నిష్పక్షపాతoగా పని చేయాలన్నారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులుకు, ప్రజలకు, పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ పత్రిక విలేకరి నర్సింలు ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు శేకర్, ప్రభాకర్, చిన్న పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago