పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే క్రీడా పోటీల ద్వారా వాతావరణం వెల్లివిరిస్తుందని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు . పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన రుద్రారం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలు ఘనంగా ముగిసాయి. రుద్రారం ప్రీమియర్ లీగ్ పోటీలలో రన్నర్ విన్నర్ విజేతలకు 30 వేల రూపాయల మరియు 20 వేల రూపాయల ప్రైజ్ మనీ ట్రోఫీ బహుమతి అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రారం గ్రామ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తున్నామని క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక వ్యాయామం లభిస్తుందని తెలిపారు.ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులోనూ నిర్వహించాలని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నే రాజు, హరి ప్రసాద్ రెడ్డి, ప్రముఖ సామాజిక సేవ నేత సాబాద సాయికుమార్, గ్రామ యువ నాయకుడు సత్యనారాయణ రెడ్డి, వార్డు సభ్యులు, క్రీడాకారులు ,గ్రామ ప్రజలు, వివిధ సంఘాల యువకులు, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…