Telangana

గీతంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీ.ఎడ్

2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆరంభం

ఎన్.సి.ఇ.టి.లో అర్హత సాధించడం తప్పనిసరి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సమగ్ర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని)ను ప్రవేశపెట్టనుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా బి.ఏ. బి.ఎడ్., బి.ఎస్సీ. బి.ఎడ్. అనే నాలుగేళ్ల డ్యూయల్-మేజర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తుందని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రిచా శర్మ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. భారతదేశ జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 చట్రంలో ఇది భాగమని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ శర్మ వివరిస్తూ, భవిష్యత్తు కోసం అత్యంత అర్హత కలిగిన, బహుళ-విషయ పరిజ్జానం గల విద్యావేత్తలను తయారు చేసే లక్ష్యంతో, 12 తరగతి లేదా ఇంటర్మీడియెట్ తరువాత వెంటనే విషయ పరిజ్జానాన్ని వృత్తిపరమైన బోధనా శిక్షణతో అనుసంధానించడానికి సమగ్ర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. పాఠశాల విద్యలోని వివిధ దశలలో ఉన్న విద్యార్థుల కోసం వారి వయస్సుకు తగిన అభ్యాస అనుభవాలను సృష్టించగల ఉత్సాహవంతులైన, వృత్తిపరంగా శిక్షణ పొందిన, సామాజిక బాధ్యత గల ఉపాధ్యాయులను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలియజేశారు.

నాలుగేళ్ల సమగ్ర కార్యక్రమం, కాబోయే ఉపాధ్యాయులకు విషయం, బోధనా పద్ధతులు, విలువలు, తరగతి గది ఆచరణలో సమగ్ర శిక్షణను అందించడమే ప్రధాన లక్షాలుగా డాక్టర్ రిచా పేర్కొన్నారు. ఈ పాఠ్యప్రణాళిక 21వ శతాబ్దపు ప్రపంచ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూనే, బాల్య దశ సంరక్షణ, విద్య (ఈసీసీఈ), ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (ఎఫ్ఎల్ఎన్), సమ్మిళిత విద్య, భారతీయ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఈ సమగ్ర అండర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం, కొత్త పాఠశాల నిర్మాణంలోని నాలుగు దశలైన- ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ (5+3+3+4) కోసం ఉపాధ్యాయులను సిద్ధం చేస్తుందని డాక్టర్ రిచా వివరించారు. విద్యార్థులు సాంప్రదాయ ఐదేళ్ల మార్గానికి బదులుగా తమ ఉపాధ్యాయ విద్యను నాలుగేళ్లలో పూర్తి చేయవచ్చని, తద్వారా ఒక విద్యా సంవత్సరాన్ని ఆదా చేసుకోవచ్చని ఆమె తెలిపారు.

2026-27 విద్యా సంవత్సరానికి గాను, ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 223 భాగస్వామ్య సంస్థలలో (ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రాంతీయ విద్యా సంస్థ (ఆర్ఐఈ)లు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పాటు గీతంలో కూడా) ఈ కోర్సును అందిస్తున్నారని, దాదాపు 16,950 సీట్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని డాక్టర్ రిచా శర్మ పేర్కొన్నారు. జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎన్.సి.ఇ.టి.) 2026 ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలను నిర్వహిస్తారని, ఈ పరీక్షలో సాధించిన అర్హతను బట్టే ఆయా సంస్థలు ప్రవేశాలు కల్పిస్తాయని తెలిపారు.మరిన్ని వివరాల కోసం, ఆసక్తి గల విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు 95 42 42 42 59 / 66 లను సంప్రదించాలని, లేదా గీతం అధికారిక వెబ్ సైట్ www.gitam.edu ను సందర్శించాలని డాక్టర్ రిచా సూచించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago