పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం ఘనపూర్ గ్రామంలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న గ్రామపంచాయతీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, 17 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హాయంలో తీవ్ర నిర్లక్ష్యానికి, అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు సీఎం కెసిఆర్ దూర దృష్టితో ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ, కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించడంతోపాటు ప్రతి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సిసి రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించడానికి ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీల తో పాటు ట్రాక్టర్లు సైతం అందించడం జరిగిందని తెలిపారు. జనాభా ఆధారంగా ప్రతినెల అనేదిలు మంజూరు చేయడంతో పాటు పూర్తి పారదర్శకతతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…