Hyderabad

గీతమ్ లో పీహెచ్డీ ప్రవేశాలకు…

గీతమ్ లో పీహెచ్డీ ప్రవేశాలకు...

జూన్ 15 న ‘ ఆర్ సెట్ ‘

పటాన్ చెరు:

గీతం డీమ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ , సైన్స్ , మేనేజ్ మెంట్ , ఫార్మశీ , లా , వివిధ సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు జరపాలనుకునే వారికి జూన్ 15 వ తేదీన రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( ఆర్ సెట్ ) నిర్వహిస్తున్నట్టు గీతం పరిశోధన , కన్సల్టెన్సీ సేవల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ రాజా ఫణి పప్పు తెలిపారు . మొత్తం 40 శాస్త్ర విభాగాలలో 2020-21 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న ‘ ఆర్ సెట్’కు దాదాపు రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని , అధికంగా ఇంజనీరింగ్ , సైన్స్ , మేనేజ్ మెంట్ విభాగాలకు దరఖాస్తులు అందినట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( యూజీసీ ) నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు.

ఆన్‌లైన్ విధానంలో 140 మార్కులకు గాను నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్షలో 50 శాతం మార్కులు సాధించిన వారిని వ్యక్తిగత ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తామని తెలియజేశారు . ఇంటర్వ్యూ 60 మార్కులకు ఉంటుందన్నారు . ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్కులు , వ్యక్తిగత ఇంటర్వ్యూలో అభ్యర్థి కనబరిచే ప్రతిభ ఆధారంగా పీహెచ్ డీలో ప్రవేశం కల్పిస్తామని రాజా తెలిపారు . మంగళవారం జరగనున్న ప్రవేశ పరీక్ష రెండు గంటల కాల వ్యవధి ఉంటుందని , దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అభ్యర్థులకు పంపామన్నారు . ఫలితాలను ఒక్క రోజులోనే వెల్లడిస్తామని డైరెక్టర్ తెలియజేశారు .

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

14 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago