Districts

ఈటెల రాజేందర్ గెలుపుతో అలాదుర్గం బిజెపి కార్యాలయం లో సంబరాలు

మనవార్తలు,మెదక్ :

ఈటెల రాజేందర్ గెలుపుతో మెదక్ జిల్లా  అల్లాదుర్గం మండల కేంద్రంలో బిజెపి కార్యాలయం ముందు బిజెపి నాయకులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కాల రాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ ఈటల రాజేందర్ గెలుపు సందర్భంగా ఆనందోత్సాహాల్లో సంబరాలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల భారీ మెజారిటీతో గెలిచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు .

తెరాస ప్రభుత్వం బిజెపి పై తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు అర్థం చేసుకొని బిజెపి చేస్తున్న పరిపాలన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను చూసి ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలుపొందడం హర్షదాయకం అని అన్నారు. ఈ గెలుపు టిఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టులాంటిది అన్నారు.

ఈటల రాజేందర్ 20 వేల మెజారిటీతో ప్రత్యర్థి అయిన టిఆర్ఎస్ అభ్యర్థి పై భారీ మెజార్టీతో గెలుపొందిన టిఆర్ఎస్ కు దిమ్మతిరిగేలా చేసిందన్నారు. బిజెపిని వ్యతిరేకించే వారికి ఇదే గతి పడుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపి అన్ని స్థానాల్లో గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ కు భారీ మెజార్టీ ఇచ్చిన హుజురాబాద్ ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా సెక్రెటరీ రవి, శామయ్య, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

12 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

14 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago