మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
స్వయం డిజైనర్ స్టూడియో పేరుతో హైదరాబాదులో సరికొత్త డిజైనర్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. యమునా బధిత ఏర్పాటు చేసిన ఈ ఫ్లాగ్ షిప్ స్టోర్ ను ప్రముఖ సినీనటి ప్రణీత సుభాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రణీత సుభాష్ మాట్లాడుతూ ఒకప్పుడు డిజైనర్ దుస్తులు డిజైనర్లు హైదరాబాదులో అందుబాటులో ఉండేవారు కాదని కానీ ఇప్పుడు ప్రపంచ వేదికపై హైదరాబాద్ డిజైనర్ లో తమ ఖ్యాతిని చాటుతున్నారని అన్నారు అంతే కాకుండా సాంప్రదాయ దుస్తులకు ఆధునికతను మేళవిస్తూ అద్భుతంగా సృష్టిస్తున్నారన్నారు శుభకార్యాలు, అందాల వేడుకలు ఏవైనా ఇప్పుడు డిజైనర్ దుస్తులు ప్రత్యేకంగా నిలుస్తున్నాయన్నారు. తాను సైతం డిజైనర్ దుస్తులను అవసరానికి అనుగుణంగా ధరిస్తానని చెప్పారు. నిర్వాహకురాలు యమునా బదిత మాట్లాడుతూ తాను లండన్ లో మాస్టర్ చేశానని డిజైనర్ రంగంపై తనకున్న అభిలాషతో ఈ స్టోర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము అందించే డిజైన్లు సౌకర్యవంతంగా అందాన్ని ఇనుమడింపజేసేలా ఉంటాయని అన్నారు.గతంలో ఆన్లైన్లో తమ సేవలు అందించామని, ఇప్పుడు నగరవాసులకు ఈ స్టోర్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఖాజా గూడా లో ఏర్పాటుచేసిన ఈ స్టోర్ ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…