Lifestyle

స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను ప్రారంభించిన సినీ నటి అనన్య నాగళ్ల

గచ్చిబౌలిలో ‘రిదా రేడియన్స్’

కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్ తో ట్రీట్ మెంట్ ఇస్తాం : సీఈఓ సయ్యద్ కరిష్మా

మనవార్తలు ,హైదరాబాద్:

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం. అన్నాడో కవి. ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో అందానిదే అగ్రస్థానం. తాము అందంగా కనిపించడం కోసం స్త్రీ, పురుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం అవసరమైనప్పుడల్లా కొత్త కొత్త పంథాలు అనుసరిస్తూనే ఉంటారు. అలాంటి వారి అభిరుచికి అనుగుణంగా.. వాళ్లను మరింత అందంగా.. ఆకర్షణీయంగా చూపించేందుకు సిద్ధమైంది మా రిదా రేడియన్స్.సినీ నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఒక్కరేమిటి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకే ట్రీట్మెంట్ ఇస్తుంది మా రిదా రేడియన్స్ మిమ్మల్ని అందంగా చూపిస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత ఇనుమడింపజేస్తూ ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మిమ్మల్ని చక్కగా చూపించి ఉన్నత స్థానంలో నిలబెట్టడమే మా ధ్యేయం. అందుకే గచ్చిబౌలిలోని ఫాంటసీ స్క్వేర్ లో మా రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సెంటర్ బ్రాంచ్ ని ప్రారంభించాము.ఈ క్లినిక్ ను ప్రముఖ సినీనటి అనన్య నాగళ్ళ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రిదా రేడియన్స్ సీఈఓ సయ్యద్ కరిష్మా మాట్లాడుతూ.. తమ రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్.. కువైట్ దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిందని అన్నారు. ఈ నేపథ్యంలో మన హైదరాబాద్ లో కూడా మన కస్టమర్లకు వినూత్న సేవలు అందించాలనే ఉద్దేశంతో.. గచ్చిబౌలిలోని ఫాంటసీ స్క్వేర్ లో తమ రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కువైట్ బ్రాంచ్ ను ప్రారంభించినట్లు వెల్లడించారు.

50 శాతం డిస్కౌంట్..

చర్మ సౌందర్యానికి, ఇతర చర్మ సమస్యలకు తగు విధమైన చక్కటి పరిష్కారం.. హెయిర్ గ్రోత్ లో కలిగే ఇబ్బందులు తక్కువ కాలంలో పరిష్కరిస్తామని సీఈఓ కరిష్మా వెల్లడించారు. అలాగే రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ప్రారంభోత్సవం సందర్భంగా.. తమ క్లినిక్ కి వచ్చే కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్ తో ట్రీట్ మెంట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కరిష్మా వెల్లడించారు. తమ సేవలు వినియోగించుకుంటారని తప్పక క్లినిక్ ను ఆదరిస్తారని ఈ సందర్భంగా ఆమె కోరారు. అనంతరం సినీనటి అనన్య మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉండేలా గచ్చిబౌలిలో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే అందంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ రిదా రేడియన్స్ హెయిర్ క్లినిక్ ను దర్శించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో రిదా రేడియన్స్ సీఈఓ సయ్యద్ కరిష్మా, ప్రముఖ యాంకర్, నటి సునైన, నటుడు రాజేశ్, డాక్టర్ శృతి, డాక్టర్ ఐశ్వర్య పులవర్తి, రిదా రేడియన్స్ మేనేజర్ సీమాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

36 minutes ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

3 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago