తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి ప్రభుత్వ రంగం సంస్థలు , స్వచ్చంధ సంస్థలతో పాటు ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారు .పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వడంతో మొక్కల పెంపకం జోరుగా సాగుతుంది .హైదరాబాద్ నిజాంపేట్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగి రాంబాబు చల్లా, ప్రవీణ దంపతుల పిల్లలు ఇంటి ప్రాంగణాన్ని నర్సరీగా మార్చారు. స్థానిక శ్రీరాం స్కూల్‌లో దిశిత ఏడవ తరగతి , తమ్ముడు సహర్ష్ మూడోవ తరగతి చదువుతున్నారు. అక్క తమ్ముడు కలిసి వినూత్నంగా ఆలోచించి పండ్ల మొక్కలు పెంచాలనుకున్నారు . వేసవిలో పండే మామిడి పండ్లను తిని టెంకలను సేకరించి ఇంటి ప్రాంగణంలో సుమారు 200 మామిడి మొక్కలు పెంపకం చేపట్టారు . ఈ విషయాన్ని తండ్రి రాంబాబు కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు . ఈ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ చిన్నారుల తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ రీ ట్వీట్ చేశారు.పచ్చదనం పెంపొందించేందుకు మేము సైతం అంటూ ముందుకు వచ్చిన దిశిత, సహర్ష్ లను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ,నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్‌లు అభినందించారు. హరిత హారంలో భాగంగా దిశిత, సహర్ష్‌లు పెంచిన పండ్ల మొక్కలు వారికి పంపిణీ చేశారు.
తాము చిన్నప్సటి నుండి మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారిమని బ్యాంక్ ఉద్యోగి రాంబాబు చల్లా తెలిపారు . పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు కృషిగా మొక్కల పెంపకంలో తమవంతు సాయం అందించామన్నారు. పిల్లలు స్వయంగా యూట్యూబ్ చూసి వేసవిలో తిన్న మామిడి టెంకలతో చిన్న నర్సరీ ఏర్పాటు చేసుకున్నారని వారు తెలిపారు . హరిత హారం కార్యక్రమంలో భాగంగా పిల్లలు పెంచిన మొక్కలను ఇంటి వద్ద , స్కూల్ పరిసరాల్లో మొక్కలు నాటారని చెప్పారు . పండ్ల మొక్కల పెంపకానికి సేంద్రియ ఎరువులు ఉపయోగించారని.. ప్రతి రోజు నీటిని పోస్తూ రెండువందలకుపైగా మొక్కలు పెంచారని అన్నారు
పర్యావరణం కాపాడటంలో తమ వంతు సాయం అందిస్తున్నాం – దిశిత , సహర్ష్
వేసవిలో మామిడి పండ్లను తిని టెంకలను పారవేయకుండా ఇంటి ప్రాంగణంలో నాటామని… ఒకటి కాదు రెండు ఏకంగా రెండోందల టెంకలు సేకరించి మినీ గార్డెన్‌ను తయారు చేశామని దిశిత ,సహర్ష్ చెబుతున్నారు . సేంద్రియ ఎరువులతో మొక్కలను పెంచామని… ప్రతి రోజు నీటిని పోస్తూ మొక్కలను పెంచామని చెప్పుకువచ్చారు . మాకు సపోర్ట్‌గా మా తల్లిదండ్రులు నిలిచారని చెప్పారు . మేం తీసుకున్న ఈ నిర్ణయానికి ఐటీ , మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించడం సంతోషంగా ఉందన్నారు . మేం పెంచిన మొక్కలను ఎమ్మెల్యే వివేకానంద్, మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్‌లకు పంపిణీ చేశామన్నారు . ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…