Hyderabad

పండుగల టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ నియోజకవర్గం వ్యాప్తంగా పండుగ వాతావరణం

నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

డప్పు చప్పుళ్లు, బైక్ ర్యాలీలు, పటాసుల మోతలు, కార్యకర్తల నృత్యాలతో నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అంబరాన్ని తాకేలా పండుగ వాతావరణంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ నిర్వహించారు. పటాన్చెరు పట్టణంతోపాటు, రుద్రారం, అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, జిహెచ్ఎంసి పరిధిలోని రామచంద్రపురం, భారతి నగర్, తెల్లాపూర్ మున్సిపల్, జిన్నారం మండల పరిధిలోని మాదారం కొడకంచి, జిన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ జెండాలను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గ వ్యాప్తంగా జెండా పండుగను నిర్వహించినట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడంలో టిఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామం అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన మహోన్నత బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. రేపటి నుండి గ్రామ, మండల, డివిజన్ స్థాయి పార్టీ నూతన కమిటీలను ఎన్నుకున్నట్లు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ కమిటీలను రూపొందించనున్నట్లు తెలిపారు. జెండా పండుగ ను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు నాయకులకు ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

పటాన్చెరు పట్టణంలో..

పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన జెండా పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమని గూడెం యాదమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, నర్ర బిక్షపతి, రాజు, మాధవి, మతిన్, షకీల్, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రుద్రారం లో..
పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండా పండుగ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పాండు, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గాయత్రి, పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అమిన్ పూర్ మండల పరిధిలో..

అమిన్ పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ గ్రామాల్లో నిర్వహించిన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఈర్ల రాజు, గ్రామ సర్పంచ్ కృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు సుల్తాన్పూర్ రాజు, పార్టీ సీనియర్ నాయకులు బషీర్, జ్ఞానేశ్వర్, సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

రామచంద్రపురం పరిధిలో..
రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ లతోపాటు, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, పార్టీ అధ్యక్షులు పరమేష్ యాదవ్, దేవేందర్, మల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago