Hyderabad

కోటి రూపాయలతో అమీన్పూర్ లో వైకుంఠధామం

అమీన్పూర్

అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం కోటి రూపాయలతో వైకుంఠధామం నిర్మించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని టైలర్స్ కాలనీలో గల ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కోటి రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న వైకుంఠధామం నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. మనిషి జీవితంలో చివరి ప్రయాణాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్న లక్ష్యంతో వైకుంఠధామాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న వైకుంఠధామం లో ఆధునిక సౌకర్యాలతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago