భారత ప్రభుత్వ నిధులు, ఐఐటీ రూర్కీ సహకారంతో నిర్వహణ
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
జాతీయ సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యతలకు అనుగుణంగా, అధ్యాపకులు పాఠ్యప్రణాళికలను ఆధునీకరించ డానికి, ప్రత్యేక ప్రయోగశాల మాడ్యూళ్లను అభివృద్ధి చేయడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్.డి.పి) నిర్వహించనుంది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులు, ఐఐటీ రూర్కీ సహకారంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ‘సైబర్ సెక్యూరిటీ కోసం పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రఫీ, ప్రామాణీకరణ, కృత్రిమ మేధస్సు’ పేరిట దీనిని నవంబరు 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు.5జీ/6జీ నెట్ వర్కులు, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్ ఆవిర్భావం వల్ల ఎదురవుతున్న భద్రతా సవాళ్లను పరిష్కరించేందుకు, అధ్యాపకులు, పరిశోధకులకు అభివృద్ధి చెందుతున్న సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలను అందించే లక్ష్యంతో దీనిని రూపొందించారు. ఇది క్వాంటమ్-నిరోధక క్రిప్టోగ్రాఫిక్ అల్గోరిథంలు, సురక్షిత కమ్యూనికేషన్, ప్రమాణీకరణ, కీలక అంగీకార ప్రోటోకాల్స్, ఇంకా ఏఐ ఆధారిత ముప్పు గుర్తింపుపై దృష్టి సారిస్తుంది.
ఆధునిక క్రిప్టోగ్రఫీ, పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రాఫిక్ అల్గోరిథంలు, లాటిస్, కోడ్-ఆధారిత అమలు, వైర్ లెస్ ప్రామాణీకరణ యంత్రాంగాలు, నిజ-సమయ అసాధారణ, మాల్వేర్ గుర్తింపు కోసం ఏఐఎంఎల్ అప్లికేషన్లు వంటి కీలక రంగాలను ఈ ఎఫ్.డి.పి.లో వివరిస్తారు. నిపుణుల ఉపన్యాసాలు, సాంకేతిక చర్చలు, ఆచరణాత్మ శిక్షణ ద్వారా, ఇందులో పాల్గొనేవారు అభివృద్ధి చెందుతున్న సైబర్ సెక్యూరిటీ సాంకేతికతలపై ఆచరణాత్మక అవగాహన పొందుతారు.ఐఐటీ రూర్కీకి చెందిన డాక్టర్ రాఘవేంద్ర సింగ్ రోహిత్, ప్రొఫెసర్ మనోజ్ మిశ్రా, ప్రొఫెసర్ సుగతా గంగోపాధ్యాయ; ఐఐటీ జమ్మూకు చెందిన డాక్టర్ భూపేంద్ర సింగ్; వారణాసిలోని ఐఐటీకి చెందిన డాక్టర్ అవనీష్ కుమార్ యాదవ్ వంటి ప్రముఖ వక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన సంస్థల నుంచి కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అనుబంధ విభాగాలకు చెందిన అధ్యాపక సభ్యులు, పరిశోధకులు, విద్యా నిపుణుల కోసం ఈ ఎఫ్.డి.పి.ని ఉద్దేశించారు. వర్దమాన సాంకేతికతలలో ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి వీలు కల్పించడం ద్వారా సైబర్ సెక్యూరిటీ విద్య, పరిశోధనను బలోపేతం చేయాలని సంకల్పించారు.నిర్ణీత హాజరు, మూల్యాంకనం, ప్రయోగాత్మక కార్యకలాపాల అవసరాలను పూర్తిచేసిన సదస్యులకు, దీనిని విజయవంతంగా పూర్తిచేసినట్లుగా ధృవపత్రాలను అందజేస్తారు. ఆసక్తి గలవారు తమ పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం డాక్టర్ సహన డి.ఎస్.ను 988 695 7788 ద్వారా లేదా ssanthos@gitam.eduకు ఈమెయిల్ చేయడం ద్వారా సంప్రదించాలి.
400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్న మియాపూర్ యువ నాయకుడు…
ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు పటాన్చెరు, మనవార్తలు…
సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల…
10 లక్షల రూపాయల విరాళం అందజేత భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక…
భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, క్వాంటం మిషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: అభివృద్ధి…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద…