10 లక్షల రూపాయల విరాళం అందజేత
భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ
ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణం కీలకం
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:
పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన ఆధ్యాత్మిక సేవాభావాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం, అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు.తాజాగా బీరంగూడ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. శనివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులకు ఈ విరాళాన్ని అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలే కాకుండా ఆధ్యాత్మిక చింతనకు, భక్తిభావానికి, సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో భక్తిభావం, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడంలో ఆలయాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.బీరంగూడ గుట్టపై నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తానని ఆలయ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్ కొల్లూరి మల్లేష్, చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్న మియాపూర్ యువ నాయకుడు…
ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు పటాన్‌చెరు, మనవార్తలు…
సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల…
భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, క్వాంటం మిషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: అభివృద్ధి…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద…
కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు అమీన్‌పూర్, మనవార్తలు ప్రతినిధి: అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్…