Telangana

12 గంటల్లో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన అమీన్‌పూర్ పోలీసులు

కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

అమీన్‌పూర్, మనవార్తలు ప్రతినిధి:

అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండున్నరేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించి చిన్నారిని సురక్షితంగా రక్షించారు.
ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అమీన్‌పూర్‌లో నివాసముంటున్న ఎరుకల సరిత (25) సమీపంలోని టిఫిన్ సెంటర్‌కు పనికి వెళ్లగా, ఇంట్లో ఉన్న ఆమె రెండున్నరేళ్ల కుమార్తె అక్షిత కనిపించకుండా పోయింది. దీంతో బాధితురాలు మధ్యాహ్నం 1.30 గంటలకు అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అమీన్‌పూర్, చందానగర్, పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఎస్‌ఓటీ బృందాలతో కలిపి 25 మంది పోలీసులతో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఓ మహిళ చిన్నారిని అపహరించినట్లు గుర్తించి, ఆమె మెదక్ జిల్లాకు చెందినదిగా నిర్ధారించారు.మెదక్ టౌన్ పోలీసుల సహకారంతో నర్సిఖేడ్ గ్రామంలో నిందితురాలు గంగామణి (44), వృత్తి: పనిమనిషిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె చెరలో ఉన్న చిన్నారి అక్షితను సురక్షితంగా రక్షించి అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
స్థానిక పోలీసులతో పాటు ఎస్‌ఓటీ బృందాలు సమన్వయంతో పనిచేసి కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించాయి. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన అమీన్‌పూర్, చందానగర్, పటాన్‌చెరు పోలీస్ సిబ్బంది, ఎస్‌ఓటీ బృందాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

admin

Recent Posts

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో 9వ మెగా మెడికల్ క్యాంప్

400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్న మియాపూర్ యువ నాయకుడు…

20 hours ago

ఘనంగా ఐఐటి చుక్కారామయ్య 101 వ పుట్టినరోజు వేడుకలు

ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు పటాన్‌చెరు, మనవార్తలు…

20 hours ago

క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ  పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల…

1 day ago

బీరంగూడ అయ్యప్పస్వామి దేవాలయానికి ఎమ్మెల్యే జిఎంఆర్ భారీ విరాళం

10 లక్షల రూపాయల విరాళం అందజేత భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక…

1 day ago

క్వాంటం టెక్నాలజీపై అధ్యాపక వికాస కార్యక్రమం

భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, క్వాంటం మిషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: అభివృద్ధి…

1 day ago

సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద…

2 days ago