Telangana

క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ 

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ ల నిర్వహణకు నిధులు అందిస్తూ క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో నవంబర్ 22 వ తేదీ నుండి మహారాష్ట్ర లోని షిర్డీ వేదికగా జరగనున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అండర్-14 బాల బాలికల జట్లకు ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కిట్లను క్రీడాకారులకు అందజేశారు.శుక్రవారం సాయంత్రం పటాన్‌చెరు లోని మైత్రి మైదానం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర జట్టుకు లక్ష 50 వేల రూపాయల సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్, భోజన వసతి, ప్రయాణ ఖర్చులు అందించడం జరిగిందని తెలిపారు.పటాన్‌చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.జాతీయస్థాయిలో అద్భుతమైన ప్రదర్శనతో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు శివకుమారి, రామ రాజు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో 9వ మెగా మెడికల్ క్యాంప్

400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్న మియాపూర్ యువ నాయకుడు…

20 hours ago

ఘనంగా ఐఐటి చుక్కారామయ్య 101 వ పుట్టినరోజు వేడుకలు

ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు పటాన్‌చెరు, మనవార్తలు…

20 hours ago

బీరంగూడ అయ్యప్పస్వామి దేవాలయానికి ఎమ్మెల్యే జిఎంఆర్ భారీ విరాళం

10 లక్షల రూపాయల విరాళం అందజేత భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక…

1 day ago

క్వాంటం టెక్నాలజీపై అధ్యాపక వికాస కార్యక్రమం

భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, క్వాంటం మిషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: అభివృద్ధి…

1 day ago

సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద…

2 days ago

12 గంటల్లో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన అమీన్‌పూర్ పోలీసులు

కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు అమీన్‌పూర్, మనవార్తలు ప్రతినిధి: అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్…

2 days ago