భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, క్వాంటం మిషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:
అభివృద్ధి చెందుతున్న క్వాంటం టెక్నాలజీస్ లో సైద్ధాంతిక అవగాహన, పరిశోధనా సామర్థ్యాలను పెంపొందించడానికి ఆరు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్.డి.పి) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఈనెల 23 నుంచి 28 వరకు నిర్వహించనుంది. క్వాంటం సెంటర్, జాతీయ క్వాంటం మిషన్, భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగాల సహకారంతో, గీతం స్కూల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కు చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఎస్ఈ), కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ (ఏఐ&డీఎస్) విభాగాలు దీనిని నిర్వహిస్తున్నాయి.ఈ కార్యక్రమంలో, క్వాంటం కంప్యూటింగ్, అల్గారిథమ్స్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, క్రిప్టోగ్రఫీ, ఎర్రర్ కరెక్షన్, క్విస్కిట్ (Qiskit) ఉపయోగించి ఆచరణాత్మకంగా వినియోగించడానికి నేర్చుకునే అంశాలుంటాయి. నిపుణుల ఉపన్యాసాలు, ముఖాముఖి చర్చలు, ప్రదర్శనలు, ప్రాక్టికల్ సెషన్ల ద్వారా ఈ ఎఫ్.డి.పి. సైద్ధాంతిక అంతర్దృష్టులను, ఆచరణాత్మక అనుభవాల కలయికను అందిస్తూ, అంతర్-విభాగ పరిశోధన, విద్యా సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.ఐసీటీఎస్-టీఐఎఫ్ఆర్ బెంగళూరు ప్రొఫెసర్ జైకుమార్ రాధాకృష్ణన్, ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ వెంకట వివేక్ కుమార్ కొప్పుల, కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అశ్విన్ నాయక్, హైదరాబాదులోని బిట్స్ పిలానీకి చెందిన ప్రొఫెసర్ తులసి మోహన్ మొల్లి, డాక్టర్ టి.ఎస్.ఎల్. రాధిక, విప్రోకు చెందిన కె.ఎస్.వి. అనురాగ్ వంటి ప్రముఖ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.మరిన్ని వివరాల కోసం ఎఫ్.డి.పి. సమన్వయకర్త డాక్టర్ ఎల్. శ్రీనివాస చక్రవర్తిని 98 666 56 855ను, లేదా quantumcenter@gitam.edu కు ఈమెయిల్ చేయడం ద్వారా సంప్రదించాలి.
400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్న మియాపూర్ యువ నాయకుడు…
ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు పటాన్‌చెరు, మనవార్తలు…
సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల…
10 లక్షల రూపాయల విరాళం అందజేత భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద…
కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు అమీన్‌పూర్, మనవార్తలు ప్రతినిధి: అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్…