– గీతం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు డెరైక్టర్ నీకే మిట్టల్ ఉద్బోధ
మనవార్తలు ,పటాన్ చెరు:
ఏదైనా ఒక అంశాన్ని ప్రయోగాత్మకంగా , అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అది పది కాలాలపాటు జ్ఞాపకం ఉండడమే గాక , విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తుందని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ నీకే మిట్టల్ అన్నారు . మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ ద్విచక్ర వాహనంలో లోపాలను కనుగొనడం , ఇంధన సామర్థ్యం ‘ అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒక రోజు కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఇంజనీరింగ్ ఔత్సాహికుల కోసం ప్రయోగాత్మకంగా నిర్వహించే కార్యశాలలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు . ప్రతి అభ్యాసాన్నీ ఎందుకు , ఎలా అనే విచారణాత్మక వైఖరితో ఆరంభించాలని , ప్రతి నైపుణ్య అనుభవాన్ని జ్ఞాపకం , అవగాహన , అన్వయంతో పొందాలని మిట్టల్ సూచించారు . బీటెక్ రెండు , మూడు , నాలుగో ఏడాది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యశాలలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లు , ఆయా విడిభాగాలను జోడించడం , విడదీయడం , సొంత వాహనాలలో ఏవైనా లోపాలున్నాయా , ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు దానిని అధిగమించే విధానాలను ( సొంతంగా రిపేర్ చేసుకోవడం ) సీనియర్ విద్యార్థులు వివరించారు .
ఎంతో ఉత్సుకతతో సాగిన ఈ కార్యశాలలో వాస్తవిక అనుభవాన్ని విద్యార్థులు పొందడంతో పాటు ఆయా అంశాలపై ప్రాథమిక అవగాహనను ఏర్పరచుకున్నారు . తొలుత , మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ స్వాగత ప్రసంగంతో ఆరంభమైన ఈ కార్యశాలలో ప్రొఫెసర్ పి . ఈశ్వరయ్య , కార్యక్రమ సమన్వయకర్తలు పి.అనీలక్కుమార్రెడ్డి , జె.రమేష్ , ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు . ఇందులో పాల్గొన్న విద్యార్థులందరికీ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేయడంతో ఈ ఒకరోజు వర్క్షాప్ ముగిసింది . ‘ కేఫ్ కనెక్షన్స్ ‘ ప్రారంభం ఆహారం యువతను ఉత్తేజపరిచేలా పనిచేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే .
విద్యార్థుల సృజనాత్మక మనస్సులను ఉత్తేజపరిచి , వారిని ప్రేరేపించడానికి గాను గీతం హెదరాబాద్ ప్రాంగణంలో గురువారం ‘ కేఫ్ కనెక్షన్స్ ‘ పేరిట ఆధునిక ఫలహారశాలను అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ . శివప్రసాద్ ప్రారంభించారు . ఇది విద్యార్థులకు పరిశుభ్రమైన , ఆరోగ్యకరమైన ఆహారం , స్నాక్స్ , ఐస్క్రీమ్లు , శీతల పానీయాలను అందిస్తుంది . విద్యార్థులు కొద్దిసేపు సేదతీరి , వారి క్షుద్బాధను తీర్చుకోవడానికే గాక , అనధికారికంగా నేర్చుకునే సమర్థవంతమైన ప్రదేశం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు . ఈ కార్యక్రమంలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ కూడా పాల్గొన్నారు .
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…