పటాన్ చెరు:
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది . నేటి నుంచి పది రోజుల పాటు పల్లె పట్టన ప్రగతి కార్యక్రమం కొనసాగుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ప్రారంభించారు . పటాన్ చెరు ,ఎల్.ఐ. జి బస్టాప్ ప్రాంగణంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనుల కోసం ఏర్పాటుచేసిన వాహనాలను జెండా ఊపి ఆమె ప్రారంభించారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలు అభివృద్ధిలో ఒక భాగమని తెలిపారు.
.తెలంగాణకు హరిత హారం నిర్మించే క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని భారతినగర్ కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని ఆమె కోరారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీలలో పేరుకుపోయిన చెత్త ను తొలగించడం, మురికి కాలువలు శుభ్రం చేయడం, తుప్పు పట్టిన ఎలక్ట్రికల్ పోల్స్ ని తొలగించడం, గుంతలు ఉంటే వాటిని మూసివేసి నీరు నిలువ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పది రోజులపాటు నిర్వహించే ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపుచ్చారు.
ఈ కార్యక్రమానికి కమిషనర్ బాలయ్య, జి హెచ్ ఎం సి ఎలక్ట్రికల్ డిఈ నాగమణి ,టీఎస్ఎస్పి డిసిఎల్ ఏఈ దీప్తి , ఎంటమాలజీ ఏఈ శంకర్ ,జీహెచ్‌ఎంసీ రంజిత్ , డివిజన్ ప్రెసిడెంట్ దేవేందర్ చారి , వార్డ్ మెంబర్ నరసింహ , యాదగిరి రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , యది రెడ్డి,దేవేందర్ రెడ్డి, కృష్ణ గౌడ్, కుతుబద్దీన్, జావిద్,సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్,జీలని తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…