Telangana

సృష్టిలో ప్రతి అణువు పరమ శివుడే

ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి : నీలం మధు ముదిరాజ్

జహీరాబాద్ కేతకీ సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నీలం మధు దంపతులు 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సృష్టిలో ప్రతి అణువు పరమ శివుడే అని పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంఘం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజల్లో ఆయన సతీసమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమృత పుష్కరణలో జల లింగానికి పూజలు నిర్వహించి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర గర్భాలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నీలం కు ఘన స్వాగతం పలికారు, పూజారులు వేద మంత్రాలతో వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు .ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఆ పరమ శివుడు ఆశిస్సులతో ప్రజలంతా బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు హనుమంతరావు పాటిల్, ఆలయ ఈవో రుద్రయ్య స్వామి, సృజన్ పాటిల్,శేఖర్ పాటిల్, నవాజ్ రెడ్డి,గోపాల్,శ్రీకాంత్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి, బంటు శేఖర్, శివ,ఉత్సవా నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

6 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

6 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

6 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

18 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

20 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago