Telangana

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయండి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరిన అఖిలపక్ష బృందం నాయకులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పాత అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాల అఖిలపక్ష బృంద సభ్యులు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమీన్పూర్ పేరుతో కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, సుల్తాన్పూర్, జానకంపేట, దాయర, ఐలాపూర్, ఐలాపూర్ తాండ, వడకపల్లి గ్రామాలతో కలిసి మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో విలీనం చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమీన్పూర్ మున్సిపాలిటీనీ జిహెచ్ఎంసి లో విలీనం చేయడంతో పాటు బీరంగూడ, అమీన్పూర్ కేంద్రాలుగా రెండు డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విభజనలో అమీన్పూర్ మండలానికి తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఎమ్మెల్యేకు విన్నవించారు. 8 గ్రామాల పరిధిలో 60 వేలకు పైగా జనాభాతో పాటు సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ పార్క తో పాటు 40 వేలకు పైగా ఓటర్లు ఉన్నారని వారు తెలిపారు. పరిపాలన సౌలభ్యం, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించాలని వారు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి నూతన డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ సర్పంచులు కృష్ణ , శ్రీకాంత్, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago