Telangana

ఈఎస్ ఐ కార్పొరేషన్ నిధులను కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాలి

డిస్పెన్సరీలలో డాక్టర్ల కొరతను నివారించాలి

సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ఈఎస్ ఐ కార్పొరేషన్ నిధులను కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ఈఎస్ఐ కార్పొరేషన్ నిధులను కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాలంటూ హైదరాబాద్ లోని ఈ ఎస్ ఐ సి కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ సిహెచ్ అనిత కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాజిద్ అలీ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ కార్పొరేషన్ పరిధిలో 25 లక్షల మంది ఇన్సూరెన్స్ పర్సన్స్ గా ఉన్నారని, 2024.2025 సంవత్సరానికి 325 కోట్ల రూపాయలు మాత్రమే ఈఎస్ఐ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిందని గుర్తు చేశారు. ఒక్కొక్క ఐ పి మెంబర్ కు 3000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, రాష్ట్రంలోని ఐపి మెంబర్ల ద్వారా 725 కోట్ల రూపాయలు ఈఎస్ఐ కార్పొరేషన్ కు వెళుతున్నప్పుడు, కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయవలసిన బాధ్యత ఈఎస్ఐ కార్పొరేషన్ మీద ఉన్నప్పటికీ కార్పొరేషన్ నిధులను దొడ్డిదారిన మళ్లిస్తున్నారని ఆరోపించారు.

ఇందులో 65% నిధులను జీతభత్యాల కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ, కేవలం 35% నిధులను మాత్రమే కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈఎస్ఐ కార్మికుల నిధుల పైన సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో 69 ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నాయని డిస్పెన్సరీల అభివృద్ధి కోసం నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. ఒక్క రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ పరిధిలో మూడు లక్షల మంది ఐపీ మెంబర్స్ ఉన్నారని గుర్తు చేశారు. పటాన్ చెరు,పాటి, బొల్లారం, బొంతపల్లి, ఇస్నాపూర్, సదాశివపేట, జహీరాబాద్ డిస్పెన్సరీలలో డాక్టర్ల కొరతను నివారించాలని అన్నారు. అనేక డిస్పెన్సరీలలో మందుల కొరత, సర్జికల్ ఐటమ్స్, మెడికల్ కిడ్స్, సమస్య తీవ్రతరమవుతున్న పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికుల జీతాల నుంచి ఈఎస్ఐ కార్పొరేషన్ కు ప్రతినెల చెల్లించిన, ఈఎస్ఐ హాస్పిటల్స్ లలో మెరుగైన సౌకర్యాల కోసం 100% గా ఉన్న నిధులలో ఎందుకు 75 శాతం నిధులను ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు.

40 సంవత్సరాలు పైబడిన ఐపి కుటుంబాలకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని11.03.2026 న జారి చేశారన్నారు. నిబంధనలు ఉన్న ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహించ లేదని, నెలకు ఒకసారి ఐపీ సభ్యుల కు ఒకసారి అందించవలసిన సూపర్ స్పెషాలిటీ మందులు కూడా కేవలం ఒక నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో మాత్రమే అందిస్తున్నారని రాష్ట్రమంతా ఉన్న ఐపి సభ్యులు ఎలా నాచారం వెళ్లి తీసుకుంటారని ప్రశ్నించారు. కార్మికుల డబ్బులను ప్రతి నెల ఈఎస్ఐ కార్పొరేషన్ లో జమ చేస్తున్నందున కార్మికుల మెరుగైన సౌకర్యాల కోసం ఖర్చు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని, ఈఎస్ఐని పకడ్బందీగా అమలు చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు బి అర్జున్ లు పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

17 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

18 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

18 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

23 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

23 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

23 hours ago