Telangana

ఉత్సాహంగా రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :

స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA)పై అవగాహన కలిగించేందుకు క్యూర్ ఎస్‌ఎంఏ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026’ నాలుగో ఎడిషన్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నాడు ఉదయం నిర్వహించారు. ఈ రన్ కార్యక్రమంలో ఎస్‌ఎంఏ బాధిత కుటుంబాలు, వైద్య నిపుణులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, రన్నర్లు, పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.ఈ రన్ కు ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ లతో పాటు రైన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ పీడియాట్రిషియన్ డాక్టర్ రాధా రమాదేవి, సీడీఎఫ్‌డీ డయాగ్నోస్టిక్స్ విభాగం అధిపతి డాక్టర్ అశ్విన్ దాలాల్, లైట్నింగ్ లైవ్స్ సీఈఓ, శాస్త్రవేత్త డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్, పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని కూడా పాల్గొని ఎస్‌ఎంఏ కమ్యూనిటీకి తమ మద్దతు తెలుపుతూ, ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026’ను ప్రారంభించారు. 21కే, 10కే, 5కే విభాగాల్లో రన్ కొనసాగింది. ప్రొఫెషనల్ రన్నర్లు, ఫిట్‌నెస్‌ ప్రియులు, ఎస్‌ఎంఏతో జీవిస్తున్న చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం చాటారు.

ఈ సందర్భంగా క్యూయర్ ఎస్‌ఎంఏ ఇండియా సహ వ్యవస్థాపకురాలు, ట్రస్టీ శ్రీలక్ష్మి నలం మాట్లాడుతూ.. ఎస్‌ఎంఏ వ్యాధికి సకాలంలో చికిత్స అందించడం చాలా కీలకం..వ్యాధి నిర్ధారణ ఆలస్యమైతే కండరాల పనితీరును తిరిగి పొందలేని అవకాశం ఉంటుందన్నారు. ప్రతి 38 మందిలో ఒకరు ఎస్‌ఎంఏ క్యారియర్‌గా ఉండే అవకాశం ఉందని, చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో తమ క్యారియర్ స్థితి గురించి వారికి తెలియకపోవచ్చాన్నారు. అందువల్ల జన్యు క్యారియర్ స్క్రీనింగ్ నివారణతో పాటు అవగాహన కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని శ్రీలక్ష్మి నలం తెలిపారు.

ఉచిత ఎస్‌ఎంఏ జన్యు క్యారియర్ స్క్రీనింగ్

ఈ ఏడాది ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ’ కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం ఉచిత ఎస్‌ఎంఏ జన్యు క్యారియర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కూడా స్టేడియం ఆవరణలో నిర్వహించారు. డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్, లైట్నింగ్ లైవ్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పాల్గొన్న వారు జన్యు స్క్రీనింగ్ పరీక్ష ద్వారా తమ క్యారియర్ స్థితిని తెలుసుకునే అవకాశం పొందారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago