అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు..
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రాపురం:
ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఆదివారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఆషాఢమాసంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలవడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని పేర్కొన్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రజలంతా ఐక్యంగా, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…