Telangana

కార్మికుల సంక్షేమం భద్రత,చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సిఐటియు తోనే సాధ్యం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయించిన చరిత్ర సిఐటియు దే

కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ రద్దు కోసం ఐక్యంగా ఉద్యమించాలి

జైల్ భరో ను కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి

కిర్బి కార్మికుల అభినందన సభ భారీ ర్యాలీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

కార్మికుల సంక్షేమం, భద్రత, చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సిఐటియు తోనే సాధ్యమని, కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ రద్దు కోసం ఐక్యంగా పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కిర్బి యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు అన్నారు.కిర్బి పరిశ్రమలో కార్మికుల చారిత్రాత్మక వేతన ఒప్పందం జరిగిన సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం కిర్బీ కార్మికుల అభినందన సభ రామచంద్రపురం ఎల్ఐజి భరత్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఎల్ఐజీ చౌరస్తా నుండి ఫంక్షన్ హాల్ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కిర్బికార్మికులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న చుక్క రాములు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్న తరుణంలో వాటికి ఎదురోడ్డి పోరాడుతున్న సంఘం సిఐటియు అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికుల సంక్షేమం ఉద్యోగ భద్రత చారిత్రాత్మక వేతన ఒప్పందాలు, కాజువల్ కార్మికుల పర్మనెంట్ చేయించడం సిఐటియు తోనే సాధ్యమన్నారు.

కార్మికుల సహకారంతో ఎన్నో విజయాలు సాధిస్తున్నామని, కిర్బీ పరిశ్రమలో నాలుగు సార్లు గెలిచి మూడు చారిత్రాత్మక వేతన ఒప్పందాలు చేయడంతో కార్మికుల వేతనాల్లో భారీ పెరుగుదల వచ్చిందని గుర్తు చేశారు. ఈ అగ్రిమెంట్ లో 117 మంది కార్మికులు పెర్మనెంట్ అవుతున్నారని, ఇప్పటివరకు ఒక్క కిర్బి పరిశ్రమలో 235 మంది కార్మికులను పర్మనెంట్ చేయించిన చరిత్ర సిఐటియు దే అని అన్నారు. జిల్లాలో అనేక పరిశ్రమల్లో క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ సాధించిన చరిత్ర సిఐటియు కు ఉన్నదని అన్నారు. సిఐటియు ను బలోపేతం చేయడం ద్వారా మరిన్ని విజయాలు సాధించగలమని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చుక్క రాములు పిలుపునిచ్చారు.

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సిఐటియు అని అన్నారు. కార్మికులకు ఉన్న 29 రకాల చట్టాలను రద్దుచేసి కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని దానిని కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చార.సిఐటియు జిల్లా కోశాధికారి కే రాజయ్య, కిర్బి యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అతిమేల మానిక్, యూనియన్ జనరల్ సెక్రెటరీ విఎస్ రాజు మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోగలమన్నారు. ఈ సందర్భంగా వివిధ పరిశ్రమల నుండి యూనియన్ నాయకులు పాల్గొని అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తోషిబా యూనియన్ జనరల్ సెక్రెటరీ అనంతరావు, శాండ్విక్ జనరల్ సెక్రెటరీ ప్రదీప్, మహేంద్ర అండ్ మహీంద్రా నరేష్, సినర్జీ శాంత్ కుమార్, పార్లే సంతోష్ గౌడ్, కోహేన్ ఫార్మా వెంకటేష్, టిఐడిసి వెంకటేష్ భాస్కర్ రెడ్డి, బిహెచ్ఇఎల్ బాషా, పిఎన్ఎమ్ జిల్లా అధ్యక్షులు రాజు, కిర్బి యూనియన్ ఆఫీస్ బేరర్స్ తలారి శ్రీనివాస్, నాగప్రసాద్, సుధాకర్, రాజిరెడ్డి, విటల్ మల్లేష్, శ్యామ్, శంకర్, బిలాల్, మధు, పెద్దిరాజు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago