Telangana

ఇంటర్మీడియెట్ విద్యార్థులకు గీతం అవగాహన

అధ్యాపకుల పర్యవేక్షణలో గణిత, విజ్జాన శాస్త్రాల బోధన

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం ముత్తంగిలోని MJPTBCWRJC, Sangareddy, and SOE Girls కళాశాలలోని ఇంటర్మీడియెట్ విద్యార్థుల కోసం గణిత, విజ్జాన శాస్త్ర అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్ డ్, ఈఏపీసెట్ పరీక్షలకు సమర్థవంతమైన సన్నద్ధత వ్యూహాలను విద్యార్థులకు అందించడంతో పాటు, ఇంజనీరింగ్, గణితం, విజ్జాన శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.అధ్యాపక బృందం, విద్యార్థి వాలంటీర్లు కలిసి పరీక్షా సంబంధిత భావనలు, సమయాన్ని ఆదా చేసే గణితంలో సులువైన మార్గాలు (షార్ట్ కట్లు), శాస్త్రీయ సమస్య పరిష్కార పద్ధతులు, వృత్తి మార్గదర్శనంపై ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.నేర్చుకున్న భావనలను మరింత పటిష్టం చేయడానికి ఒక ఆసక్తికరమైన క్విజ్ పోటీని నిర్వహించారు. ఇందులో విజేతలకు గీతం లోగోతో కూడిన వాటర్ బాటిళ్లు, పెన్నులను బహుమతిగా అందజేశారు.పోటీ పరీక్షల కోసం తమ ఆత్మవిశ్వాసాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంచిన ఆచరణాత్మక చిట్కాలను, సులువైన పద్ధతులను విద్యార్థులు ఎంతగానో ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.అధ్యాపక సమన్వయకర్తలు డాక్టర్ పి.నరసింహస్వామి, డాక్టర్ శివారెడ్డి శేరి, డాక్టర్ పి.జితేంద్ర సేనాపతి, డాక్టర్ ఎస్.చక్రవర్తిల పర్యవేక్షణలో, విద్యార్థులు త్రిషల్ సాయి వల్లేపల్లి, చింతలకుంట నితిన్ కుమార్, సుభాంగి పాండా, అనుష్క ప్రజాపతి, పిర్లమర్ల లక్ష్మీ వజ్ర, తలమంచి మనోజ్ కుమార్ ఈ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago