Telangana

హోరెత్తిన మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సిద్దిపేట ఇలాకలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం హోరెత్తింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజైన శుక్రవారం రోజు సిద్ధిపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం చేపట్టారు. స్థానిక బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ఓల్డ్ బస్టాండ్, నర్సాపురం క్రాస్ రోడ్, లాల్ కమాన్, గాంధీ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం, రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ వరకు ప్రచార ర్యాలీని చేపట్టారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జి కొండా సురేఖ, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సిద్దిపేట ఇన్చార్జి పూజల హరికృష్ణ, గజ్వేల్ ఇన్చార్జి తూముకుంట నర్సిరెడ్డి, దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకురాలు తూముకుంట ఆకాంక్ష హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచార రథంలో అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యంగా యువత ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. ఆయా పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో వారికి ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మంత్రి సురేఖ, అభ్యర్థి నీలం మధుకు మహిళలు మంగళహారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు టీ.శ్రీనివాస్ గౌడ్, గంప మహేందర్, కలీమొద్దీన్, సాకి ఆనంద్, బుచ్చిరెడ్డి, మార్క సతీష్, అత్తు ఇమామ్, లక్ష్మి, చక్రధర్ గౌడ్, దేవులపల్లి యాదగిరి, చిట్టి దేవేందర్ రెడ్డి, ఎస్టిడి శ్రీనివాస్, మీసం నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి బొమ్మల యాదగిరి, దర్పల్లి చంద్రం, పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago