శేరిలింగంపల్లి :
నిర్మాణ రంగ దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కూకట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులుసి.పి, ఏసిపి ఎండి ఖుద్దూస్, సెక్షన్ అధికారులు తెలిపారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ లో గల హోటల్ రేణు గ్రాండ్స్ లో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్ పల్లి సిటీ ప్లానర్ నరసింహ రాములు, ఏసిపి ఎండి ఖుద్దుస్ లు హాజరయ్యారు.ఈ సమావేశంలో భవన నిర్మాణదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
హెచ్ఎండిఏ పరిధిలో నాలా సమస్యతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమస్య పరిష్కరించాలని నిర్మాణదారులు కోరారు. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో సాప్ట్ వేర్ అనుసంధానం లో డిలీట్ అయిన ఫైళ్ళను వెంటనే జత చేయాల్సిందిగా అభ్యర్థించారు. హెచ్ఎండీఏ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్ తో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజురోజుకు నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో బిల్డర్ల పై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నగరంతో పాటు శివారు ప్రాంతాలలో రోజురోజుకు పెరుగుతున్న భూముల ధరలతో పాటు నిర్మాణ రంగానికి సంబంధించిన సిమెంట్, ఇటుకలు,ఇసక, ఇనుము వంటి మెటీరియల్స్ ధరలు కూడా పెరగడంతో బిల్డర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిర్మాణ రంగంపై అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినప్పటికీ కనీసం వడ్డీ కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ప్లానర్ నరసింహ రాములు, ఏసీపీ ఎండి ఖుద్దుస్ లు మాట్లాడుతూ బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్ప సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి ఎం ప్రేమ్ కుమార్, బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు నాగేశ్వరరావు, సత్యం శ్రీరంగం, చెన్నారెడ్డి, కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ,కె వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…