పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం గ్రామంలో గల మహిధర లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కాలనీలో నూతనంగా నిర్మించిన క్లబ్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోచారం గ్రామ పరిధిలో 700 గృహాలతో అత్యాధునిక వసతులతో గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. కాలనీకి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించాలన్న కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు.. త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మంచినీరు అందిస్తానని హామీ ఇచ్చారు. కాలనీ సమీపంలో గల డంపింగ్ యార్డ్ తరలించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి సైతం సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ఏర్పాటు అవుతున్న నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహీధర ప్రాజెక్ట్స్ సీఎండి ప్రశాంత్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ జగన్, మాజీ ఎంపీటీసీ బిక్షపతి, ముత్తంగి పిఎసిఎస్ అధ్యక్షులు బిక్షపతి, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు స్వాతి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…