విద్యా భారతి పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి 20 లక్షల రూపాయల భారీ విరాళం
మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:
విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనమని సమాజ అభివృద్ధికి వ్యక్తిగత ఎదుగుదలలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో గల విద్యా భారతి పాఠశాలలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను సోమవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు జాతీయ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించడంలో విద్యా భారతి సంస్థల కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానంలోనూ సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ ను సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యా భారతి సంస్థ దక్షిణ క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, భారతీ విద్యా సమితి అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, కార్యదర్శి రవి, టప్ప కుమార్, సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…