హైదరాబాద్
పెట్రోల్ బంక్ లో మైక్రో చిప్ లతో మూడు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా ను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. పెట్రోల్ బంక్ లో సాఫ్ట్ వేర్ లను మార్చి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుండేవారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక లో కలిపి మొత్తం 34 పెట్రోల్ బంక్ లలో మైక్రో చిప్ ల ద్వారా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితులను పట్టుకున్న పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా… బాల నగర్ డీసీపీ పద్మజ మాట్లాడుతూ… ఫైజుల్ బారి , సందీప్, ఎండీ అస్లం ముగ్గురు పథకం ప్రకారం మోసం చేస్తున్నారు.
మైక్రో చిప్స్ పెట్టిన నలుగురితో పాటు పెట్రోల్ బంక్స్ యజమానులు నలుగురిని అరెస్ట్ చేశాం.గతంలో పెట్రోల్ బంక్ లో పని చేసిన అనుభవం ఉండడంతో ఈజీ గా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం తో మోసం చేస్తున్నారని అన్నారు.మిషన్ ను ట్యాపరింగ్ చేసి ఓ మైక్రో చిప్ పెట్టి మోసం చేస్తున్నారని…. లీటర్ కి 30 ML వరకు తక్కువ వచ్చేలా ప్రోగ్రాం తయారు చేసి మోసం చేస్తున్నారని అన్నారు. ఇలా మైక్రో చిప్ ను రెండు లక్షలు రూపాయలకు పెట్రోల్ బంక్ డీలర్లు, యజమానులకు అమ్మకాలు చేశారు.
ఇలా వచ్చిన డబ్బుతోటి ఈ ముఠా ఒప్పందం ప్రకారం పంచుకుంటున్నారని తెలిపారు.ఈ ముఠా పై మొత్తం 6 కేసులు నమోదు చేశామని… జీడిమెట్ల, మైలార్ దేవుల పల్లి, మేడ్చల్ , జవహర్ నగర్ లో కేసులు నమోదు చేశామన్నారు. కామారెడ్డి, వనపర్తి, ఖమ్మం , సిద్ధి పేట్, నెల్లూరు , సూర్య పేట్ లో ఇలా మోసం చేస్తున్నారని పద్మజ అన్నారు. కర్ణాటక , ఏపీ లో కూడా ఇలా చిప్ లు అమ్మకాలు చేస్తూ పబ్లిక్ ను మోసం చేస్తున్నారన్నారు.ఇప్పటికే పెట్రోల్ బంక్ డీలర్లు, యజమానులు నలుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…