Telangana

గీతమ్ లో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో శనివారం ముందస్తు ( హోలీ , జాలీ ) క్రిస్మస్ వేడుకలను ఉల్లాసంగా , ఉత్సాహంగా జరుపుకున్నారు . శివాజీ ఆడిటోరియంలో విద్యార్థులు వరుసగా 12 వ ఏడాది ఏర్పాటు చేసిన జననోత్సవ ప్రత్యేక సభ , క్రిస్మస్ పాటల ప్రతిధ్వనితో మార్మోగింది . అందంగా అలంకరించిన క్రిస్మస్ చెట్టు , గంటలు , పుష్పగుచ్ఛాలు , బెలూన్లతో ఆడిటోరియం అంతా పండుగ శోభను సంతరించుకుంది . ప్రార్థనా బృందం , సంగీతం , నృత్యాలు , బ్యాండ్ , నాటికల ప్రదర్శన ఆహూతులందరినీ అలరించాయి . విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న నెపుణ్యాలు ఈ సందర్భంగా వెలికి రావడంతో పాటు ప్రేక్షకులను ఒకింత ఆశ్చర్యచకితులను చేశాయి . శాంతాక్లాజ్ వేషధారి ఆడిటోరియం అంతా కలియ తిరుగుతూ , చాక్లెట్లు , బహుమతులను పంపిణీ చేశాడు .

ఈ వేడుకలలో భాగంగా , ఉత్సాహభరిత , సందర్భోచిత కళలను ప్రదర్శించిన విద్యార్థులందరినీ ముఖ్య అతిథిగా హాజరైనై ముత్తంగి డివెన్డ్ వర్డ్ సెంటర్ ఫాదర్ సతీష్ ప్రత్యేకంగా అభినందించారు . క్రిస్మస్ అనేది ఒక సమయం లేదా సీజన్ కాదని , మానసిక స్థితి అని ఆయన ఉద్ఘాటించారు . శాంతి , సద్భావనను గౌరవించడం , దయతో ఉండడం క్రిస్మస్ వేడుకల నిజమైన సందేశంగా ఆయన అభివర్ణించారు . తమ స్నేహితులు , అధ్యాపకులతో కలిసి ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడంపై పలువురు విద్యార్థులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు . చివరిగా అల్పాహారంతో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి .

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

18 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

18 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

18 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago